1947 India

1947 లో భారతదేశంలోని విశేషాలు

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాకముందు చాలా డిఫరెంట్ గా ఉండేది. 1947 లో భారతదేశం  ఏ విధంగా ఉండేదో చూద్దాం.

1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు భారతదేశం, అఖండ భారతదేశంగా పిలవబడేది. అఖండ భారతదేశం అంటే ఆన్సఇంట్ ఇండియా . అందులో పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ ,శ్రీలంక అన్నీ ఇండియా లోనే ఉండేవి. అప్పట్లో అఖండ భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం 12% మాత్రమే ఉండేది. అంతేకాకుండా మొత్తం అఖండ భారతదేశంలో 5000 హై స్కూల్స్ మాత్రమే ఉండేవి. అంతే కాకుండా 600 కాలేజెస్ మరియు 25 యూనివర్సిటీస్ మాత్రమే ఉండేవి.

1947 లో భారతదేశానికి రైల్వే వచ్చింది. కానీ అంతకుముందే భారతదేశానికి రైల్వే ట్రాక్ ఉండేది. అది ఇండియాలో మొట్టమొదటి సారిగా ముంబై లోని బోర్ బందర్ నుండి థానే వరకు 20 బోగీల ట్రైన్ నడిచింది. ఆ ట్రైన్ ను లాగటానికి 3 స్ట్రీమ్ ఇంజిన్ లను అమర్చాడు. 1947 కల్ల  భారతదేశం మొత్తంలో 204 ట్రైన్లు తిరిగాయి.

1947 లో బాంబే యొక్క జనాభా 16లక్షలు మాత్రమే ఉండేది. అప్పట్లో బాంబే యొక్క సరిహద్దులు కేవలం అంధేరి వరకే ఉండేవి. అంధేరి అవతలి ప్రాంతాలైన జోగేశ్వరి అవుట్ అఫ్ బాంబే కింద లెక్కించేవారు.

1947 లో ఇండియన్ మోటార్స్ వచ్చేవి. 1947 కు ముందు వరకు హిందుస్థాన్, మహేంద్ర వంటి వెహికల్స్ వచ్చేవి. అంతేకాకుండా ఓపెన్ డబల్ డెక్కర్ బస్సెస్ కూడా 1947 లోనే భారత దేశంలో ఉన్నాయి. అప్పట్లో టికెట్ ఆ బస్ లకు 4 అణాలు మాత్రమే ఉండేది.

అంతేకాకుండా 1947 లో  ఒక్క లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు ఉండేది. 1947 లో జనరల్ మోటార్స్ ఎక్కువగా నడిచేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనరల్ మోటార్స్ కంపెనీకి గుడ్ బై చెప్పేసింది. ఎందుకంటె,అప్పట్లో జనరల్ మోటార్స్ కంపెనీకి ఇండియన్ మోటార్స్ పోటీగా ఉండేది.

1947 లో భారతదేశంలో ఎయిర్ వేస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ నేషనల్ ఎయిర్ వేస్, అంబికా ఎయిర్ వేస్, కళింగ ఎయిర్ వేస్, డెక్కన్ ఎయిర్ వేస్, ఎయిర్ సర్వీస్ ఆఫ్ ఇండియా, భారత ఎయిర్ వేస్. జుపిటర్ ఎయిర్ వేస్ వంటి ఎయిర్ వేస్ కంపెనీస్ వచ్చాయి. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎందుకు ఇన్ని ఎయిర్ వేస్ వచ్చాయంటే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన దగ్గర ఉన్న విమానాలన్నిటిని అమ్మేసింది. కొంతమంది ధనికులు ఆ విమానాలను కొన్ని ఎయిర్ లయన్స్ బిసినెస్ ను స్టార్ట్ చేసారు.

కేవలం 8 ఎయిర్ లయన్స్ కు మాత్రమే భారతదేశం రాష్ట్రీయ ఎయిర్ లయన్స్ గా  ప్రకటించింది. వాటన్నిటిని ఇండియన్ ఎయిర్ లయన్స్ లో విలీనం చేసింది. మరియు టాటా ఎయిర్ లయన్స్ పేరు ఎయిర్ ఇండియా గానే ఉంది. 1947 సంవత్సరానికి భారతదేశంలో మొత్తం 15 ఎయిర్ పోర్ట్స్ ఉండేవి.

మనలో చాలామంది భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ఒక్క రూపాయి ఒక్క డాలర్ తో సమానం అని చెప్తూ ఉంటారు. కానీ అది ఏది నిజం కాదు. 1947 ఆగష్టు 15 వ తేదీన ఒక్క డాలర్ రేటు 3రూపాయల 35పైసలు ఉంది. మరియు ఒక్క పౌండ్ కి  13.33 పైసలుగా ఉండేది. ఇప్పటితో పోలిస్తే అప్పటి రూపాయి చాలా గట్టిగ ఉండేది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాకిస్థాన్ కి స్వాతంత్య్రం కావాలన్నది. పాకిస్థాన్ కి కూడా  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ కరెన్సీ ని ఉపయోగించి ఆర్ధిక వ్యవస్థను నడపాలనే ఆలోచనలో పడింది. ఎందుకంటే డబ్బులు ప్రింట్ చేయడానికి 6 మెషిన్స్ మాత్రమే ఉండేవి. ఆ 6 మెషిన్స్ ఇండియా కి చెందినవే. దానితో ఇండియా పర్మిషన్ తీసుకొని, ఇండియన్ నోట్ల మీద వారి ముద్ర వేసుకొని తమ కరెన్సీ గ ఉపయోగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *