ayodhya babri masjid

అయోధ్య భూవివాదం కేసు ఏమిటి?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఒక భూభాగం వివాదానికి సంబంధించిన కేసు గురించిన వివరాలు.

ఇది హిందూ దేవుడైన రాముడి జన్మస్థలం. అంతేకాకుండా బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం. ముఖ్యంగా దీనిపై వివాదం ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించినది.

1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది.

ఈ కేసుకు సంబంధించిన తీర్పు  2010 సెప్టెంబర్ 30వ తేదీన  ప్రకటించారు.

అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.

వివాదం ఈనాటిది కాదు.,

1528 వ సంవత్సరంలోనే మొగల్ రాజు ఆ ప్లేస్ లో ఉన్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు కట్టారని హిందువులు ఆరోపిస్తారు. అసలు అయోధ్య అంటేనే రాముడు పుట్టిన స్థలం. అక్కడ ఆలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు కట్టారని హిందువులు అంటున్నారు.

ఈ కారణంగా, ఇప్పటిలాగానే అప్పుడు కూడా హిందువులకు,ముస్లింలకు మధ్య గొడవలు అయ్యేయి. ఇది మొదటిసారిగా  1853లో జరిగినట్లుగా చెబుతారు. నిజానికి అంతకుముందు కూడా జరిగాయి. కానీ 1853లో జరిగిన గొడవలకు సంబంధించే రికార్డులు ఉన్నాయని తెలుస్తుంది.

రామ మందిరం మరియు బాబ్రీ మసీదు చరిత్ర


అయోధ్యలో ఈ బాబ్రీ మసీదు విషయం శతాబ్దాల నుండి హిందువులు,ముస్లింల మధ్య  వివాదం కొనసాగుతుంది. ఆ మసీదు నిర్మించిన స్థలం, తమ దేవుడైన రాముడి జన్మస్థలమని 16వ శతాబ్దంలో ఓ ముస్లిం అక్రమదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ మసీదును నిర్మించాలని హిందువులు వాదిస్తున్నారు.

మరోపక్క ఆ మసీదులో 1949 వరకు తాము ప్రార్ధనలు చేశామని అయితే ఆ ఏడాది కొంత మంది రాత్రి వేళా చీకట్లో రాముడి విగ్రహాలు తెచ్చి ఆ మసీదులో పెట్టారని ముస్లింలు అంటున్నారు. ఇది జరిగిన తర్వాత ఆ విగ్రహాలను పూజించడం మొదలైందని అంటున్నారు .

ఇది జరిగిన తర్వాత 4 దశాబ్దాల పాటు హిందూ,ముస్లింలు అక్కడ ప్రార్ధనలు చేసే హక్కుల కోసం కోర్టుకు వెళ్లాయి.

1992లో ఈ వివాదం పెరిగింది. దీనివల్ల జరిగిన గోడవలలో సుమారుగా 2000 మంది చనిపోయారు.

బాబ్రీ మసీదును ఎలా ధ్వంసం చేశారు? ఎంత మంది కరసేవకులు చనిపోయారు?

1992 డిసెంబర్ ఆరో తేదీన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి చెందిన హిందూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు.. 1,50,000 మంది కరసేవకుల (స్వచ్ఛంద కార్యకర్తల) తో అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రదర్శన, సభ నిర్వహించినట్లు ఆరోపణ. ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. వారిని భద్రతా బలగాలు నియంత్రించలేకపోయాయి.

బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో 16 మంది కరసేవకులు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రికార్డులు చెప్తున్నాయని కౌశిక్ చెప్పారు.

దీని తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2,000 మంది చనిపోయారు.

కేంద్ర ప్రభుత్వం 1993లో ఒక పాలనా ఉత్తర్వు ద్వారా మొత్తం 67.7 ఎకరాల విస్తీర్ణంలోని సదరు వివాదాస్పద స్థలాన్ని తన స్వాధీనం చేసుకుంది.

ఫెన్సింగ్ వేసిన బ్రిటిష్ ప్రభుత్వం

1859లో బ్రిటిష్ ప్రభుత్వం ఆ స్థలం గురించి దశాబ్దాలుగా వివాదం ఉండడంతో దానిని రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది. లోపలి స్థలం మసీదు కోసం,బయటి స్థలం హిందువుల కోసమని విభజించింది. 1885లో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్ళింది. ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించాలని మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ కోర్ట్ లో అప్పీల్ చేసారు.

మసీదు అడుగున ఆలయ ఆనవాళ్లు

2003 ఆగష్టులో ఆర్కియాలజిస్ట్ సర్వేలో మసీదు కింద రాముడి ఆలయ ఆనవాళ్లు దొరికాయి. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనకు సంబంధించి ఏడుగురు నేతలపై విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత సంవత్సరానికి మసీదు కూల్చివేతలో అధ్వాని పాత్రపై సమీక్షించాలని కోర్ట్ చెప్పింది.

2005 జులై లో ఇస్లామిక్ మిలిటెంట్లు వివాదాస్పద భూభాగంపై దాడి చేసారని ,సెక్యూరిటీ ఫోర్స్ ఐదుగురిని హతమార్చింది. మసీదు 2009 జూన్ లో మసీదు కూల్చివేతపై లిహర్హాన్ కమీషన్ ఒక నివేదికను ఇచ్చింది. 

అయితే దీనిలో బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి. వివాదాస్పద భూమిని 3 ముక్కలు చేస్తూ 2010 సెప్టెంబర్ నెలలో అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఒకటి రామాలయం కోసం,రెండోది నిర్మోహి అఖారాకు, మూడోది మసీదు కోసం కేటాయించిన తర్వాత ,మళ్ళీ అప్పీల్ కి వెళ్లారు. 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్ రద్దు చేసింది.

అయోధ్య భూవివాదం – సుప్రీంకోర్టు తీర్పు (నవంబర్ 9th,2019)

అయోధ్య కేస్ లో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది.


40 రోజుల విచారణ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.
సుప్రీం కోర్ట్ చరిత్రలో అయోధ్య కేస్ అత్యధిక రోజులు విచారణ జరిగిన రెండో కేసు. మొదటి కేసు కేశవానంద భారతి కేసు.  దీనిని అత్యున్నత న్యాయస్థానం అత్యధికంగా 68 రోజుల పాటు విచారణ జరిపింది.


2010 లో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాద పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం 3 సభ్యులతో మధ్య వ్యక్తిత్వం కమిటీని ఏర్పాటు చేసింది. తగిన పరిష్కారం చూపడంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలం కావడంతో 5 గురు జడ్జ్ ల రాజ్యాంగ ధర్మాసనం 40 రోజులపాటు రోజువారీ విచారణ ప్రారంభించింది.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయి నేతృత్వంలో 5గురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేశారు. ఇందులో జస్టిస్ గొగోయ్,శరద్ అరవింద్ బాబ్డ్,D. Y. చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఏ నజీర్ లు సభ్యులు.


అక్టోబర్ 16,2019 కోర్ట్ లో విచారణ ముగిసింది. 2019 నవంబర్ సుప్రీంకోర్ట్ చారిత్రాత్మకమైన తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును 5 గురు కమిటీ సభ్యులు ఒకే మాటపై నిలబడుతూ నిర్ణయం తెలపడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *