Kiradu Temple

ఆ సమయంలో ఈ గుడిలోకి వెళితే మనుషులు శిలలుగా మారతారు..

కొన్ని విషయాలు విన్నపుడు అవి నిజం కాదని వాటిని నమ్మకుండా కొట్టి పారేస్తుంటాము. కానీ జరిగిన సంఘటనలు చూస్తే నమ్మక తప్పదు అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో ఒకటి ఈ దేవాలయం మిస్టరీ..

ఉదయం పూట పర్యాటకులతో చాలా సందడిగా ఉంటుంది. సాయంకాలం కాగానే అక్కడ ప్లేస్ నిర్మానుష్యంగా మారిపోతుంది.  రాత్రి సమయంలో మాత్రమే ఈ ఆలయ ప్రాంగణంలో వింత వింత శబ్దాలు ఏడుపులు,పెడబొబ్బలు,అరుపులు వినిపిస్తాయి. అయినా అక్కడే ఉంటే పొద్దున అయ్యేసరికి శిలగా మారిపోతారు.

ఇది నిజమో,అబద్దమో ఎవరికి తెలియదు. ఎందుకంటె, దానిని కనుక్కోవడానికి వెళ్లిన వారు తిరిగి రాలేదు. అసలు వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు.

కిరాడు ఆలయాన్ని చూడటానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. వీరివల్ల ఈ గ్రామానికి ఉపాధి కూడా బాగానే ఉంటుంది. కానీ సాయంకాలం మాత్రం అక్కడ ఎవరూ ఉండకుండా ఆ గుడిని విడిచి వెళ్ళిపోతారు. అండ్ అక్కడ ఉన్న వాళ్లకు మీకు ప్రాణాల మీద ఆశ ఉంటె గుడి నుంచి వచ్చేయమని చెప్పి వాళ్ళను హెచ్చరిస్తారు. ఆలయానికి దూరంగా వెళ్తారు.

అయితే అసలు ఇది ఆ ఆలయం? ఇది ఎక్కడ ఉంది?ఎందుకు శిలలుగా మారిపోతారు?

రాజస్థాన్ లోని బికనీరు నుండి జైసల్మీరు వెళ్లే రహదారి. ఈ రహదారిలో ఉండే ఓ గ్రామం హాత్మ. నిజంగానే ఈ ఊర్లో  భయానక సంఘటనలు జరుగుతాయి.

హాత్మ బర్మారు జిల్లాకు 40 కిలో మీటర్ల దూరంలో చాలా ఆలయాలు ఉంటాయి. వీటినే కిరాడు ఆలయాలు అంటారు. అండ్ కిరాతకూప అనే భయంకరమైన పేరు కూడా ఉంది.

ఇక్కడ 5 ఆలయాలు ఒకే ప్రదేశంలో ఉంటాయి. ఇందులో ఒకటి వైష్ణవ ఆలయం మిగిలిన 4 శైవ ఆలయాలు. 4 గుళ్ళలో సోమేశ్వర ఆలయం ప్రసిద్ధమైనది. ఈ ఆలయంలో శిల్పాలు చాలా అపురూపంగా,అందంగా ఉంటాయి. అందుకే కిరాడు రాజస్థాన్ ఖజరహోగ పేరు పొందింది. ఈ ఆలయాల చారిత్రక నైపుణ్యం కూడా పెద్దదే. దీనిని క్రీ. శ. 11 వ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించారు.

ఇది దాదాపు 100 ఏళ్లపాటు చాల వైభవంగా ఉండేది కానీ ఆ తర్వాత మరుగుపడ్డ ఆలయం. కొంతకాలం క్రితం ఒక టీవీ రియాలిటీ షో ద్వారా ఈ గుడి,ఊరు వెలుగులోకి వచ్చాయి. దీనికి ఉన్న మిస్టరీ కారణంగా ఇది పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది.

అప్పట్లో ఈ కిరాదు ఆలయంలో ఉన్న ప్రచారాన్ని ఖండిస్తూ ఒక పరిశోధన బృందం రాత్రి పూత ఆలయంలోకి ప్రవేశించారు. ఊరిలో ప్రజలు ఎంత చూపిన వాళ్ళు వినలేదు. అర్ధరాత్రి వరకు చూడగా ఎటువంటి మార్పులు కనిపించలేదు. కానీ రాత్రి అవుతున్న కొద్ది వారిలో ఏదో తెలియని భయం,ఆందోళన మొదలయ్యాయి. రాత్రి మొత్తం అక్కడే ఉండి,అక్కడి మిస్టరీ ని చేదిద్దామనుకున్నవాళ్ళకు అక్కడ అనుకోని పరిణామాలు ఎదురు కావడంతో మధ్యరాత్రే అక్కడ నుండి పరుగు తీసారంట.. ఇప్పటికి హాత్మ గాథను కొట్టిబడేసేవారు ఉన్నారు. 

దీని వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే,

దీనంతటికి కారణం ఒక ఋషి శాపమట..,

సుమారు 900 సంవత్సరాల క్రితం ఒక ఋషి శిష్యులతో కలిసి దేశ సంచారం కోసం పర్యటిస్తుంటాడు. పర్యటనలో భాగంగా వారు ఈ గుడివద్దకు వస్తారు. అక్కడ శిష్యులను ఈ దేవాలయం వద్ద ఉంచి, తాను చుట్టుపక్కల తిరిగి రాడానికి వెళ్తాడు. అలా చాలాకాలం సంచరిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడున్న శిష్యులు రోగ గ్రస్తులు అయిపోతారు. వాళ్ళను ఎవరూ పట్టించుకోలేదట. శిష్యులు ఎన్నో ఇక్కట్లకు లోనయ్యారట. అయినా స్థానికులు ఎవరూ సహాయం చేయలేదంట. కొంతకాలం తర్వాత ఋషి తిరిగివచ్చి జరిగింది తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోతాడు. స్థానికులు వారి హృదయాలను రాళ్ళలా మార్చుకొని, శిష్యులకు సహాయం చేయలేదని వారిని బండరాళ్లు అవండి అని శపిస్తాడు. అయితే ఒక ఆమె వారికి కొంత సహాయం చేసిందట. ఆ మహిళకు శాపవిమోచనం ఇస్తా అని,వెనక్కు తిరిగి చూడకుండా ఈ గుడిని,ఊరిని వదిలి వెళ్ళమని ఋషి చెప్పగా బయలుదేరిన ఆమె అత్యుత్సాహంతో వెనక్కి తిరిగి చూడగా ఆమె శిలగా మారిపోతుంది.

ఏది ఏమయినప్పటికి  ఈ గుడి మాత్రం ఇప్పటికి మిస్టరీ గానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *