RIP

RIP అనే పదం గురించిమనకు తెలియని విషయాలు .,

తెలుసుకోకుండానే RIP అని పెట్టడం ఒక ఆచారంగా మారింది. కానీ,ఈ పదాన్ని ఎవరు ఉపయోగించాలి?ఎవరికోసం ఉపయోగించాలో చూద్దాం.,

ఒక వ్యక్తి మరణించారనే న్యూస్ చూసినపుడు లేదా విన్నపుడు, మనం RIP అని కామెంట్ పెట్టడం బాగా అలవాటుగా మారింది. కానీ, అస‌లు ఈ ప‌దం వాడ‌కూడ‌దు‌. నిజానికి మనం RIP అని ఎందుకు రాస్తున్నామో తెలియకుండానే వాడుతున్నాము. అసలు దీనికి అర్ధమేంటో చూద్దాం.,

అసలు ఎవరైనా చనిపోయారని విన్నపుడు RIP అని అనడం మన సంస్కృతిలో లేదు.  ఇది పాశ్యాత్య మతాలైన క్రిస్టియన్,ముస్లిం ఆచారాల నుండి పుట్టింది. హిందూ ధర్మం గురించి మర్చిపోవడం వలన మనకు ఈ పదం వాడుక, దాని అర్ధం,గురించి తెలియకుండా పోయింది.

RIP అనే పదానికి అర్ధం Rest In Peace. ఇది కేవలం ఎవరినైతే గొయ్యి తొవ్వి,పూడ్చిపెడతారో వాళ్ళు మాత్రమే వాడాలి. ముస్లింలు లేదా క్రిస్టియన్లు మరణించినపుడు ఈ పదాన్ని వాడొచ్చు. ఎందుకంటే, వారి ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తి మళ్లి పుడతారని వారు నమ్ముతారు. కానీ హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం శరీరం భౌతికమైనది. కానీ ఆత్మ శాశ్వతమైనది. హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన వ్యక్తిని కట్టెలు,నెయ్యితో కాలుస్తారు .

అంటే ఒక హిందు చనిపోతే,RIP అని రాయడంలో అర్ధం లేదు. హిందూ ధర్మంలో ఎవరైనా మరణిస్తే, వారి ఆత్మ దేహంలోకి వెళ్తుందని, మళ్లీ పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. సనాతన ధర్మం ప్రకారం ఆత్మకు నాశనం లేదు. అలసట లేదు. చనిపోయిన తర్వాత మనం చేసిన పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, లేదా స్వర్గ నరకాలకు వెళ్ళడమో, జరుగుతుంది. మోక్షం వరకూ ఇది కంటిన్యూ అవుతుంటుంది. అంతేకానీ ఆ రోజు గురించి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఆ ఆత్మకు కొత్త దిశ ప్రాప్తించాలని కోరుకుంటాము. హిందు ఎవరైనా చనిపోతే, వారి ఆత్మకు శాంతి చేకూరాలని,శ్రద్ధాంజలి అని మాత్రమే వాడాలి. ఫాషన్ కోసమో,స్టైల్ గా ఉంటుందనో తెలియకుండానే గుంపులో ఒకరిలా RIP అనే పదాన్ని వాడొద్దు.
ఈ మధ్య శ్రద్ధాంజలి అని రాయడానికి బదులు బద్దకించి,షార్ట్ కట్ లు వెతుకుంటూ, ఈ పదాన్ని వాడుతున్నాము

మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో, లేక స్వర్గస్తుడవ్వాలనో, శాశ్వత పుణ్య లోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప, RIP అని ప్రార్థించడం హిందూ ధర్మానికి వ్యతిరేకం. స్వ‌ర్గ ప్రాప్తిర‌స్తు అనుకోవాలి. అంతేకాని ఇలా RIP పెట్ట‌కూడదు‌‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *